4. క ఏషముక్తాధరహాస దీధితి ర్విరాజమానఃపురుషః పురో మమ |
తమాలవృక్ష స్స్పుట పల్లవాన్తర ప్రకమ్పిచణ్డంశు రివాపరస్థితః ?
పెదవుల మధ్య ప్రసరించు చిరునవ్వు కాంతులతో, చిగురుటాకుల మధ్య నుండి చలించుచున్న సూర్యకాంతులతో గూడిన, అపర తమాల వృక్షమువలె, నా ఎదురుగ ప్రకాశించుచున్నట్టి యీ పురుషుడెవ్వరు?
5. పాణిపాదాక్షిభిస్తామ్రై ర్నీలఃకోஉయం మహోదధౌ
జలజైర్జల సజ్ఘాత ఇవసఙ్గతః ?
ఎర్రని-పాదములు, చేతులు, కన్నులతో సముద్రములో నొక నీల వర్ణము గల పురుషుడు, ఎర్రని పద్మములు అచటనచట నున్నట్టి నీలమైన ఒక నాచు దిబ్బవలె శయనించియునాడు ఎవరతడు ?
6. పిఞ్ఛేన నీలకణ్ఠస్య మకుటోపరిశోభినా
కణ్ఠే చ తులసీహారః కమనీయః క ఏష భోః ?
కిరీటము కొనపై శోభించు నెమలి పింఛముతో, మెడలో తులసీ మాలతో, కమనీయుడైన ఇతడెవరు? బిగ్గరగ నడుగుచున్నాను.
Saturday, October 18, 2008
Subscribe to:
Comments (Atom)