Saturday, June 7, 2008

ప్రథమ దళమ్ (1-3)

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీ కృష్ణ భాగవతమ్
ప్రథమ దళమ్

1. పిఞ్ఛావతంసః పురుషోஉవతీర్ణ స్సువర్ణవర్ణామ్బర భాసమానః
కణ్ఠే చ దామ్నా తులసీదళానా మాలిఙ్గ్యమముత్తరళీ కరోతి

నెమలిపింఛమునలంకారముగ కలవాడును,బంగారు పీతాంబరముతో ప్రకాశించువాడును, కంఠమున తులసీమాలతో నున్న నొకానొక పురుషుదు దిగివచ్చి నన్ను కౌగలించుకొని నాకు గగుర్పాటును కలుగజేయుచున్నాడు.

2. హేమ క్షౌమ ధరోగళేచ తులసీహరః కరే వేణునా
ముగ్ధాఙ్గైవనీత మార్దవ భరై రాముక్త ముక్తా సరైః
ఆలిఙ్గన్న హమస్మిమాశుచ ఇతి ప్రేమాబ్ధి కల్లోలవ
త్కోஉయంశ్యామయునా ప్రతిక్షణమపి ప్రత్యక్ష మభాషతే?

బంగారు పట్టుధోవతి ధరించి, కంఠమున తులసీమాలతో, చేతిలో వేణువుతో, ముత్యముల మాలలతో గూడిన వెన్న యొక్క మృదుత్వముతో నిండి ముగ్ధమైన అవయవములతో, నన్ను ప్రతిక్షణము కౌగలించుకొని "నేనున్నాను బాధపడవద్దు" అని చెప్పుచు ప్రేమ సముద్రము మహాతరంగమువలె వచ్చుచున్న శ్యామయువకుడెవరు?

3. ఆగత్య పాదధ్వని కిజ్కిణీషు ముక్తావళీ భూషణ ఘోషణాసు
మాంవాదయంన్వేణు మివాన్యరూపం నిత్యం సమాలిఙ్గతి కోనునీలః?

పాదముల గజ్జెలు మ్రోగుచుండ, ముత్యముల హారములు మెల్లగ ధ్వనించుచుండ, తన వేణువుయొక్క మరొక రూపమైన నన్ను వాయించుచు, నిత్యము నన్నొక నీల వర్ణముగల పురుషుడు కౌగలించు కొనుచున్నాడు. ఎవరతడు?